ప్రేమజంట ఆత్మహత్య | Lovers commit suicide | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

Dec 14 2015 8:20 PM | Updated on Nov 6 2018 7:56 PM

తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పులేదనే కారణంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.

పాలకోడేరు (పశ్చిమగోదావరి జిల్లా) : తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పులేదనే కారణంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గరగపర్రు గ్రామానికి చెందిన డొల్ల సునీల్(20), దాసరి శిరీష(20)లిద్దరూ రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఊరి చివర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement