ప్రేమించలేదని.. బావిలో నెట్టేశాడు! | love reject woman well push | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని.. బావిలో నెట్టేశాడు!

Jun 19 2014 2:35 AM | Updated on Sep 2 2017 9:00 AM

తన ను ప్రేమించకుంటే చంపేస్తానం టూ యువతిని ఓవ్యక్తి బావిలో తోసి పరారయ్యూడు. స్థానికుల అప్రమత్తం కావడంతో బయటపడిన ఆమె.. ఎస్.కోట పోలీసులకు ఫిర్యాదుచేసింది.

శృంగవరపుకోట :తన ను ప్రేమించకుంటే చంపేస్తానం టూ యువతిని ఓవ్యక్తి బావిలో తోసి పరారయ్యూడు. స్థానికుల అప్రమత్తం కావడంతో బయటపడిన ఆమె.. ఎస్.కోట పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆమె ఫిర్యాదు లో పేర్కొన్న మేరకు వివరాలిలా ఉన్నాయి. లక్కవరపుకోట మండలంకొట్యాడగ్రామానికి చెందిన యువతి కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం మధ్యాహ్నం అదేగ్రామంలో కోటమ్మ అమ్మవారిఆలయానికి వెళ్లిం ది. అదే సమయంలోకొట్యాడ గ్రామానికే చెందిన రొం గలి కృష్ణ అక్కడకువచ్చాడు. యువతితో కాసేపు మా ట్లాడాడు. ఇద్దరూ ఒకేఊరి వారుకావడంతో ఎవరూ ఆ విషయూన్ని పెద్దగా పట్టించుకోలేదు. కుటుంబ సభ్యు లు కూడాచూసిఊరుకున్నారు.
 
 అప్పటి వరకూ కుటుం బసభ్యులఎదుటే మాట్లాడినకృష్ణ.. ఒక్కసారిగా యువ తిని సమీపంలోని బావిలోకి నెట్టి, పారిపోయూడు. ఊహించని పరిణామంతో నివ్వెరపోయిన కుటుంబ సభ్యులు.. పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి యువతిని బయటకు తీశారు. బావిలో నీరు లేకపోవటంతో యువతి స్వల్ప గాయూలతో బయటపడింది. మంగళవారం రాత్రి ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొట్యాడ గ్రామానికి చెందిన రొంగలి కృష్ణ.. కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు పెళ్లి సంబంధం కుదిరిందని, తన వెంట పడొద్దని ప్రాధేయపడినా వినిపించుకోలేదని తెలిపింది. తన అంతు చూస్తానంటూ నూతిలో తోసేశాడని పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు ఎస్.కోట ఎస్సై ఎస్.కె.ఎస్.ఘనీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement