విజయనగరం పోరుకు సై

Lok Sabha, Assembly Candidates List In Vizianagaram - Sakshi

ముగిసిన నామినేషన్ల ఘట్టం 

విజయనగరం పార్లమెంట్‌ స్థానం బరిలో 14మంది

తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో 74 మంది పోటీ

సాక్షి, విజయనగరం గంటస్తంభం: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నామినేషన్లు పక్రియ పూర్తయింది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఈ మేరకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు అధికారికంగా అధికారులు ప్రకటించారు. దీంతో తదుపరి సమరం మిగిలి ఉంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగా నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్‌ తేదీలు ప్రకటిచింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 18న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం విదితమే.

అదేరోజు జిల్లాలో ఉన్న విజయనగరం పార్లమెంట్‌ స్థానానికి కలెక్టర్‌ హరి జవహర్‌లాల్, 9 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అదేరోజు నామినేషన్లు స్వీకరించారు. ఈ పక్రియ 24వ తేదీ వరకు సాగింది. జిల్లాలో విజయనగరం పార్లమెంట్‌ స్థానానికి 18 మంది, 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు 119 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 30 మంది నామినేషన్లు పరిశీలనలో అధికారులు తిరస్కరించారు. బుధ, గురు శుక్రవారాల్లో జరిగిన నామినేషన్లు విత్‌డ్రా కార్యక్రమంలో 16 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను రిటర్నింగ్‌ అధికారులు గురువారం సాయంత్రం ప్రకటించారు. 

గుర్తుల కేటాయింపు 
అధికారిక సమాచారం ప్రకారం ఎంపీ, 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 88 మంది బరిలో ఉన్నారు. విజయనగరం ఎంపీ స్థానానికి 14మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. మిగతా 9 అసెంబ్లీ సిగ్మెంట్‌ల్లో 74మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 18 మంది స్వతంత్ర అభ్యర్ధులు కాగా మిగిలినవారంతా ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలతో పాటు ఇతర పార్టీలవారు ఉన్నారు. కురుపాం నుంచి ఒకరు, పార్వతీపురం నుంచి ఇద్దరు, సాలూరు నుంచి ముగ్గురు, గజపతినగరం నుంచి ఒకరు, నెల్లిమర్ల నుంచి ముగ్గురు, విజయనగరం నుంచి ఒకరు, ఎస్‌.కోట నుంచి ఇద్దరు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు.

విజయనగరం ఎంపీ స్థానానికి ఏకంగా ఐదుగురు స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఇదిలాఉండగా పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రిటర్నింగు అధికారులు వెంటనే గుర్తులు కేటాయించారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలకు పార్టీ గుర్తులు లభించగా గుర్తింపు లేని పార్టీలు, స్వతంత్రులకు వేరే గుర్తులు కేటాయించారు. ఈ మేరకు ఫారం–7ఎ జనరేట్‌ చేసి ఎన్నికల సంఘానికి పంపించారు. దీంతో నామినేషన్లు పక్రియ ముగిసినట్‌లైంది.

విజయనగరం ఎంపీ బరిలో నిలిచిన అభ్యర్థులు

వ.సం.

అభ్యర్థి  

 పార్టీ   కేటాయించిన గుర్తు    

1

అశోక్‌గజపతిరాజు పూసపాటి  తెలుగుదేశం     సైకిల్‌
2 ఆదిరాజు యడ్ల         కాంగ్రెస్‌పార్టీ   హస్తం
3 బెల్లాన చంద్రశేఖర్‌      వైఎస్సార్‌ సీపీ    సీలింగ్‌ ఫ్యాన్‌
4 పాకలపాటి సన్యాసిరాజు   బీజేపీ     కమలం
5 పీవీఏ సాగర్‌      సామాన్య ప్రజాపార్టీ   ఎలక్ట్రికల్‌ పోల్‌
6 చిరంజీవి లింగాల    ఆంధ్ర చైతన్యపార్టీ     టూత్‌బ్రెష్‌
7 ముక్క శ్రీనివాసరావు    జనసేన    గాజుగ్లాసు
8 లగుడు గోవిందరావు     జనజాగృతిపార్టీ    మైకు
9 కె.సూర్యభవాని    పిరమిడ్‌    ఫ్లూట్‌
10 సియాదుల ఎల్లారావు    గ్యాస్‌  స్వతంత్ర   సిలిండర్‌
11 దనలాకోటి రమణ       స్వతంత్ర    అగ్గిపెట్టె
12 పెంటపాటి రాజేష్‌       స్వతంత్ర  బ్యాటరీ టార్చ్‌
13 ఇజ్జురోతు రామునాయుడు       స్వతంత్ర  కోట్‌ 
14 వెంకట త్రినాథరావు  వెలూరు      స్వతంత్ర   సితార్‌

 

అసెంబ్లీ నియోజకవర్గాలు వారీగా బరిలో ఉన్న అభ్యర్థులు

వ.సం. నియోజకవర్గం   పోటీలో ఉన్న అభ్యర్థులు
1 కురుపాం     6
2 పార్వతీపురం    7
3 సాలూరు     8
4 బొబ్బిలి    6
5 చీపురుపల్లి     8
6 గజపతినగరం    9
7 నెల్లిమర్ల        12
8 విజయనగరం     9
9 ఎస్‌.కోట    9 

                                             
  

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top