టీడీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టిన లాయర్లు | Lawyers Complaint Against MLA Bandaru Madhava Naidu | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టిన లాయర్లు

Aug 21 2014 4:25 PM | Updated on Sep 2 2017 12:14 PM

టీడీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టిన లాయర్లు

టీడీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టిన లాయర్లు

న్యాయమూర్తి, న్యాయవాదులతో దురుసుగా ప్రవర్తించిన నరసాపురం టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుపై స్థానిక పోలీసుస్టేషన్ లో లాయర్లు ఫిర్యాదు చేశారు.

నరసాపురం: స్వాతంత్య్ర దినోత్సవం రోజున న్యాయమూర్తి, న్యాయవాదులతో దురుసుగా ప్రవర్తించిన నరసాపురం టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆయన అనుచరులపై స్థానిక పోలీసుస్టేషన్ లో బార్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న అదనపు జిల్లా న్యాయమూర్తి పి.కల్యాణరావు, న్యాయవాదులపై ఎమ్మెల్యే  మాధవనాయుడు, ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారు.

ఈ ఘటనను నిరసిస్తూ ఈనెల 19న జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. శాసనసభ్యుని దురుసు ప్రవర్తనను సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, ఎన్నికల కమిషన్, న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు పంపినట్లు బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement