విజయవాడ-ఏలూరు హైవేపై కాల్పుల ఘటనలో మరణించిన ముగ్గురి వ్యక్తుల అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం
ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు: డీసీపీ
Sep 26 2014 8:48 PM | Updated on Oct 2 2018 2:30 PM
ఏలూరు: విజయవాడ-ఏలూరు హైవేపై కాల్పుల ఘటనలో మరణించిన ముగ్గురి వ్యక్తుల అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం పినకడిమిలో పూర్తయ్యాయని విజయవాడ డీసీపీ ఇక్బాల్ తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మూడు మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశామన్నారు.
నిందితుల కోసం పినకడిమిలో 20 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించినట్టు డీసీపీ వెల్లడించారు. నిందితుల బంధువుల ఇంట్లో కూడా సోదాలు పూర్తి చేశామని ఆయన అన్నారు.
Advertisement
Advertisement