నిర్లక్ష్యపు చీకటికి శస్త్రచికిత్స! | Kurnool Government Interventional Hospital is disrupting power supply | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యపు చీకటికి శస్త్రచికిత్స!

Jun 25 2017 3:50 AM | Updated on Sep 18 2018 8:38 PM

నిర్లక్ష్యపు చీకటికి శస్త్రచికిత్స! - Sakshi

నిర్లక్ష్యపు చీకటికి శస్త్రచికిత్స!

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రెండురోజుల పాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం నెలకొంది.

పెద్దాస్పత్రిలో దిద్దుబాటు చర్యలు
విద్యుత్‌ సమస్యతో ఎలక్ట్రీషియన్ల తొలగింపు
అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ రద్దు
ఆర్‌ఎంవోలకు షోకాజ్‌ నోటీసులు
ఆసుపత్రిలో డీఎంఈ, జిల్లా కలెక్టర్‌ పర్యటన
రేపు మంత్రి కామినేని రాక

ఇంట్లోఆరోగ్యంగాఉన్నవారేఒక్కగంటపాటుకరెంటుపోతేతట్టుకోలేరు.ఉక్కపోతదోమలపోరుతోవిద్యుత్‌ఎప్పుడువస్తుందనిఎదురుచూడటంపరిపాటి.కానీఅనారోగ్యంతోఆసుపత్రిలోచేరిన
రోగులు 12 నుంచి 15 గంటల పాటుకటిక చీకటిలో, ఉక్కపోతతో మగ్గాల్సివస్తే వారికి అది ప్రత్యక్ష నరకమే. విభేదాలతో ఆసుపత్రి అధికారులు, నిర్లక్ష్యంతో సిబ్బంది ప్రత్యక్షంగా రోగులకు ఇలాంటి నరకాన్నే చూపించారు. గాలి, వానకు విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో రెండు రోజుల పాటు కర్నూలు ప్రభుత్వసర్వజన వైద్యశాలలోవిద్యుత్‌ సరఫరాకు అంతరాయంఏర్పడింది.

తక్షణమే స్పందించాల్సినఅధికారులు రాత్రంతా దరిదాపులకు రాలేదు. ఈ వ్యవహారంపై మంత్రికామినేని తీవ్రంగా స్పందించారు.మంత్రి ఆదేశాలతోశనివారం డీఎంఈడాక్టర్‌ సుబ్బారావు, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ..పెద్దాస్పత్రిని తనిఖీచేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు తీవ్రంగాస్పందించారు.సంబంధిత అధికారులకు షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. ఈఘటనపైవిచారణ జరిపేందుకు సోమవారంమంత్రి కామినేని జిల్లాకు రానున్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రెండురోజుల పాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం నెలకొంది. గాలి, వానకు ఈ నెల 21వ తేది రాత్రి 8 గంటల నుంచి మరునాడు ఉదయం 8 గంటల వరకు, శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి రాత్రంతా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి ఆసుపత్రిలోని ట్రామాకేర్, మెడికల్‌వార్డులు, చిన్నపిల్లల విభాగం, న్యూరాలజి, ఎండోక్రైనాలజి, పీడియాట్రిక్‌ సర్జరీ విభాగాలల్లోని రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

ఉక్కపోత, కటిక చీకటి, దోమకాటు వంటి సమస్యలతో వార్డు నుంచి బయటకు వచ్చేశారు. ఈ సమయంలో వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. మరమ్మతులు చేయాల్సిన ఎలక్ట్రీషియన్లు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.వీరాస్వామి రెండు మొబైల్‌ జనరేటర్లను తెప్పించి రాత్రి 2 గంటల సమయంలో  సరఫరాను పునరుద్ధరించారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఎలక్ట్రీషియన్లు వచ్చి మరమ్మతులు చేశారు.

ఎలక్ట్రీషియన్లపై వేటు..
 సమస్యకు బాధ్యులుగా చేస్తూ ముగ్గురు ఎలక్ట్రీషియన్లను విధుల నుంచి తొలగించారు. వీరిని నియమించిన ఏజెన్సీని రద్దు చేశారు. విద్యుత్‌సరఫరా, మరమ్మతుల బాధ్యతను తాత్కాలికంగా ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో ఇకపై విద్యుత్‌ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యుత్‌ స్తంభాలతో పాటు జంపర్లు కూడా పాతవై పోయాయన్నారు. వీటిని మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

‘పవర్‌’ రాజకీయంపై ఇంటెలిజెన్స్‌ ఆరా..!
ఆసుపత్రిలో ‘పవర్‌’ రాజకీయం నడుస్తోందా అన్న కోణంలో ఇంటెలిజెన్స్, ఎస్‌బీ పోలీసులు శనివారం ఆరా తీశారు. శుక్రవారం రాత్రి విద్యుత్‌ అంతరాయం ఏర్పడినప్పుడు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.వీరాస్వామి ఒక్కరే  పనులు చేయించారని, ఇతర అధికారులు ఎందుకు అక్కడికి రాలేదని ఆరా తీశారు.  నలుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లున్నా ఏ ఒక్కరికీ అధికారాలు ఇవ్వలేదా...ఒకవేళ ఇచ్చినా వారు సద్వినియోగం చేసుకోవడం లేదా అన్న కోణంలో పలువురు వైద్యులు, అధికారులను ఆరా తీశారు.

దీనికితోడు ఇటీవలే ఏఆర్‌ఎంఓగా వచ్చిన డాక్టర్‌ వసుధను ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ కార్డియాలజి విభాగానికి డిప్యూటేషన్‌పై నియమించుకున్నారు. అప్పటి నుంచి ఏఆర్‌ఎంఓ పదవిలో ఏ ఒక్కరూ విధులు నిర్వహించలేదని తెలుసుకున్నారు.  విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే.. సిబ్బంది రాత్రయినా సరే అరగంట నుంచి గంటలోపు పరిష్కరిస్తున్నారు. అలాంటిది ఏకంగా 12 గంటల పాటు పరిష్కరించకపోవడానికి కారణాలను ఎస్‌బీ పోలీసులు తెలుసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం.

షోకాజ్‌ నోటీసులు..
పెద్దాసుపత్రిలో విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఎందుకు బాధ్యత తీసుకోలేదంటూ ఆసుపత్రి ఇన్‌చార్జి సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ వై. శ్రీనివాసులు, ఏఆర్‌ఎంవో డాక్టర్‌ వసుధకు శనివారం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.వీరాస్వామి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

రేపు మంత్రి రాక
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో  విచారణ జరిపేందుకు సోమవారం మంత్రి కామినేని శ్రీనివాస్‌.. కర్నూలు రానున్నారు.

మంత్రి కామినేని ఆగ్రహం..
ఆసుపత్రిలో సమస్య వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా డీఎంఈ డాక్టర్‌ సుబ్బారావు, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణను ఆదేశించారు. దీంతో వీరిద్దరూ శనివారం ఆసుపత్రిలో వేర్వేరు సమయాల్లో పర్యటించారు. ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ భార్గవరాముడిని వెంటపెట్టుకుని ఆసుపత్రిలో ఎక్కడకెక్కడ విద్యుత్‌ సమస్యలున్నాయో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు.

సమస్య పునరావృతం కాకుండా చర్యలు..
ఆసుపత్రిలోవిద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు డీఎంఈ సుబ్బారావు తెలిపారు. వచ్చే జూలైలో స్టేట్‌ క్యాన్సర్‌ సెంటర్‌కు అనుమతి వస్తుందన్నారు. డీఎంఈ, కలెక్టర్‌ వెంట మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.వీరాస్వామి, డిప్యూ టీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌. వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ విజయభాస్కర్, డీఈ మహేశ్వరరెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement