సెప్టెంబర్‌ 3న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Krishnashtami celebrations to be held in Tirumala - Sakshi

సాక్షి, చిత్తూరు : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సెప్టెంబరు3న గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. గోకుల నందనుడు శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలు, 4న ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. 

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 12 నుండి 21వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top