నకిలీ బంగారం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ | Kovur Police Arrest man for Selling Fake Gold Jewellery | Sakshi
Sakshi News home page

నకిలీ బంగారం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Aug 21 2014 9:52 AM | Updated on Oct 9 2018 5:39 PM

నకిలీ బంగారాన్ని నిజమైన బంగారం అంటూ జనాన్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తిని నెల్లూరు జిల్లా కోవూరులో స్థానిక పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

నెల్లూరు: నకిలీ బంగారాన్ని నిజమైన బంగారం అంటూ జనాన్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తిని నెల్లూరు జిల్లా కోవూరులో స్థానిక పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.  అతడి వద్ద నుంచి రూ.19 లక్షల నగదను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు స్టేషన్కు తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిజమైన బంగారం అంటూ నకిలీ బంగారం అమ్మినట్లు తమకు జిల్లావ్యాప్తంగా ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితుడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అందులోభాగంగా ఈ రోజు ఉదయం కోవూరులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement