కిరణ్.. రాజ్యాంగం తెలుసుకో | kodandaram fires on kiran kumar reddy | Sakshi
Sakshi News home page

కిరణ్.. రాజ్యాంగం తెలుసుకో

Nov 10 2013 12:28 AM | Updated on Jul 29 2019 2:51 PM

అసెంబ్లీలో తీర్మానం చేస్తేనే తెలంగాణ ఏర్పాటవుతుందంటూ వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముందుగా రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సూచించారు.

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తీర్మానం చేస్తేనే తెలంగాణ ఏర్పాటవుతుందంటూ వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముందుగా రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సూచించారు. ఇప్పటిదాకా రాష్ట్రాలు ఏర్పాటైన విధానం గురించి కిరణ్‌కు తెలిసినట్లు లేదని, అందుకే రాజ్యాంగంలో లేని ప్రక్రియల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  హైదరాబాద్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
 
 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై సీఎం కిరణ్ రాజ్యాంగంలో లేని అంశాలపై చర్చ చేస్తున్నాడని కోదండరాం విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగంలో లేని అవాంతరాలను సీఎం కిరణ్ లేవనెత్తితే వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు భాగస్వాములవుతున్నారని ఆరోపించారు. సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్‌ల్లో తీర్మానం చేసినట్లుగా హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు లేకుండా, పదిజిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరో రూపంలో తెలంగాణపై ఆధిపత్యం, సీమాంధ్రుల పెత్తనంకోసం జరిగే కుట్రలను ప్రతిఘటిస్తామని కోదండరాం హెచ్చరించారు. ఆంక్షలు లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఒకటి రెండ్రోజుల్లో అన్ని భాగస్వామ్య పక్షాలతో సమావేశమై కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. మామిడి పండులాంటి తెలంగాణను ఇస్తారని ఆశపడితే చీకి పారేసిన టెంకను ఇవ్వడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అలాంటి తెలంగాణ ఇస్తామంటే సోనియాగాంధీకి కృతజ్ఞతలు ఎలా చెబుతారనిప్రశ్నించారు. కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... సీమాంధ్రుల భద్రత పేరుతో ఆధిపత్యం చేస్తామంటే అంగీకరించేది లేదన్నారు.
 
 కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్ అరెస్టు : ‘తెలంగాణ కదం’ పేరిట హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి టీజేఏసీ యాదగిరిగుట్ట వరకూ చేపట్టిన పాదయాత్రను పోలీసులు శనివారం అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ఇందులో పాల్గొనడానికి వచ్చిన టీజేఏసీ కన్వీనర్ కోదండరాం, కోకన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని అరెస్ట్‌చేశారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement