వివాహిత కిడ్నాప్‌నకు యత్నం | kidnap attempt on Married women | Sakshi
Sakshi News home page

వివాహిత కిడ్నాప్‌నకు యత్నం

Oct 30 2013 2:25 AM | Updated on Sep 2 2017 12:06 AM

ఓ వివాహితను కిడ్నాప్ చేయటానికి వచ్చిన యువకులు గ్రామస్తుల చేతికి చిక్కారు. టి.నరసాపురం మండలం

 టి.నరసాపురం, న్యూస్‌లైన్ :ఓ వివాహితను కిడ్నాప్ చేయటానికి వచ్చిన యువకులు గ్రామస్తుల చేతికి చిక్కారు.  టి.నరసాపురం మండలం శ్రీరామవరంలో మంగళవారం వేకువ జాము సుమారు 2 గంటలకు అరటిపండ్ల వ్యాపారి కోనా వీరాస్వామి ఇంటికి నాలుగు బైక్‌లపై ఆరుగురు యువకులు వచ్చి అతడిని నిద్రలేపారు. అరటిపండ్లు, మంచి నీళ్లు కావాలని అడిగారు. ఆయన భార్య సావిత్రి మంచి నీళ్లు తెస్తుండగా వారు తమ వద్ద ఉన్న వస్త్రంపై మత్తు మందు చల్లుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సావిత్రి అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. ఇంతలో ఆ యువకులలో నలుగురు పారిపోయా రు. పట్టుబడిన నలుగురిని స్తంభాలకు కట్టి దేహశుద్ధి చేశారు. 
 
 వీరాస్వామి కుమారుడు వెంకటరావుకు శ్రీరామవ రం గ్రామానికి చెందిన ఒక యువతి తో ఈఏడాది జూన్‌లో వివాహమైంది. ఆమె సోమవారం  పుట్టింటికి వెళ్లిం ది. ఇది తెలియక ఆమెను కిడ్నాప్ చే సేందుకు  యువకులు వచ్చి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పట్టుబడినవారిలో పెదపాడు మండలం కలపర్రుకు చెందిన ఉడతా మణికంఠ, పామర్తి వెంకటేశ్వరరావు, కొక్కిరపాడుకు చెందిన పల్లెవాడ కోటేశ్వరరావు, మందలపల్లికి చెందిన బేతిమాల మహేష్  ఉన్నారు. నలుగు రు యువకులను, మూడు బైక్‌లను    మంగళవారం ఉదయం టి.నరసాపురం పోలీసులకు అప్పగించారు.  ఎస్సై డి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement