ఫోన్‌ చేస్తే చాలు.. ఇంటికే ఏటీఎం

KDCC Bank Chairman Yarlagadda Venkatrao Said Mobile ATMs Set Up In Villages - Sakshi

చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజల సౌలభ్యం కోసం గ్రామాల్లో మొబైల్‌ ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో బ్యాంకు నుంచి సొమ్ము విత్‌ డ్రా చేసేందుకు ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలకు తమ బ్యాంకు ద్వారా ఏర్పాటు చేసిన మొబైల్‌ ఏటీఎంలను అందుబాటులో ఉంచుతామన్నారు. (తగినంత నగదు ఉండేలా చూసుకోండి..)

ఇందుకోసం ఆయా గ్రామాల ప్రజలు సంబంధిత సహకార సంఘ కార్యదర్శికి సమాచారం అందిస్తే వెంటనే మొబైల్‌ ఏటీఎంలను పంపిస్తామన్నారు. విజయవాడ, నూజివీడు డివిజన్లకు సంబంధించి 99496 88340, గుడివాడ, మచిలీపట్నం డివిజన్లకు సంబంధించి 99496 88362కు ఫోన్‌ చేసి సమాచారం అందించిన వెంటనే మొబైల్‌ ఏటీఎంలను పంపిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  (క్వార్టర్‌ @ 300)
చదవండి: అమ్మ ఎవరికైనా అమ్మే..! 
చదవండి: అడ్మిన్‌.. తస్మాత్‌ జాగ్రత్త!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top