కేసీఆర్ పెద్ద సమైక్యవాది: మంత్రి టీజీ | KCR Supports United Andhra Pradesh: TG Venkatesh | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పెద్ద సమైక్యవాది: మంత్రి టీజీ

Dec 3 2013 12:24 AM | Updated on Aug 15 2018 9:17 PM

కేసీఆర్ పెద్ద సమైక్యవాది: మంత్రి టీజీ - Sakshi

కేసీఆర్ పెద్ద సమైక్యవాది: మంత్రి టీజీ

టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు రాష్ట్రంలో పెద్ద సమైక్యవాది అని మంత్రి టీజీ.వెంకటేష్ అన్నారు.

తిరుమల: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు రాష్ట్రంలో పెద్ద సమైక్యవాది అని మంత్రి టీజీ.వెంకటేష్ అన్నారు.  శ్రీవారి దర్శనార్థం ఆయన సోమవారం రాత్రి తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలసిన విలేకరులతో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పేరుతో కేసీఆర్ సమైక్యవాదానికి మద్దతు ఇస్తున్నార న్నారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాదు, కాంగ్రెస్ నాయకత్వంలో వచ్చే తెలంగాణ కు ఆయన అంగీకరించరని అన్నారు. కేసీఆర్ వైఖరే సమైక్యవాదానికి అనుకూలంగా ఉంటోందని, ఇలాంటి తరుణంలో అశోక్‌బాబు, ఇతర సమైక్యవాదుల నాయకత్వం అవసరం లేదని ఆయన అన్నారు. కర్నూలును రాజధాని కానివ్వకుండా ఉండేందుకే కొందరు రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement