‘ఈవీఎం టెక్నాలజీని తప్పుబట్టటం సిగ్గుచేటు’ | Karumuri Nageswara Rao Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘ఈవీఎం టెక్నాలజీని తప్పుబట్టటం సిగ్గుచేటు’

Apr 13 2019 11:08 AM | Updated on Apr 13 2019 11:08 AM

Karumuri Nageswara Rao Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : టెక్నాలజీ తెచ్చిందే తానని, ఫోన్‌ కనిపెట్టింది కూడా తానే అనే చెప్పుకునే చంద్రబాబు ఈవీఎం టెక్నాలజీని తప్పుబట్టటం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వర్‌రావు దుయ్యబట్టారు. ఎవరు ఏ గుర్తుకు ఓటుకు వేశారో అదె గుర్తు ఉన్న ప్రింటెడ్‌ స్లిప్‌ కూడా వచ్చిందని గుర్తుచేశారు. తాము వేసిన ఓట్లు వేరే గుర్తుకు పడ్డాయని ఒక్క చంద్రబాబు తప్ప ఎవరూ అనడం లేదని విమర్శించారు. ఓడిపోయిన తరువాత చెప్పాల్సిన కారణాలను ఇప్పుడే చెబుతున్నారేమోనని అందరూ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

వైఎస్సార్‌సీపీ గెలవాలని వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని ఎంతో కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు, కార్యకర్తల కష్టం మర్చిపోలేనన్నారు. గెలిచిన తరువాత తమ ఇంట్లో మనిషిగా సేవ చేసుకుంటానని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement