చంద్రబాబు హయాంలోనే ఇసుక మాఫియా  | Kanna Laxminarayana Slams On Chandrababu In Krishna | Sakshi
Sakshi News home page

చంద్రబాబు హయాంలోనే ఇసుక మాఫియా 

Nov 19 2019 11:00 AM | Updated on Nov 19 2019 11:01 AM

Kanna Laxminarayana Slams On Chandrababu In Krishna - Sakshi

సాక్షి, లబ్బీపేట / విజయవాడ తూర్పు: రాష్ట్రంలో చంద్రబాబు హయాంలోనే ఇసుక మాఫియా ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించినా, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు. బృందావన కాలనీలో బీజేపీ అధికార ప్రతినిధి, ధార్మిక సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోగులూరి శ్రీకృష్ణచైతన్య శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధారి్మక సెల్‌ కార్యాలయాన్ని సోమవారం కన్నా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్‌ మీడియంకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధ ఆంగ్ల విద్యాబోధన కాకుండా, తెలుగు మీడియం పాఠశాలలు తొలగించకుండా, ఇంగ్లిష్‌ మీడియం తరగతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని మతాలను తమ పార్టీ గౌరవిస్తుందని, గత ప్రభుత్వం దేవాలయాలను కూలి్చందని, ఎన్ని క్షుద్రపూజలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ధారి్మక సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement