గవర్నర్తో మంత్రి కన్నా భేటీ.. రాజకీయాలపై చర్చ | kanna laxminarayana meets governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్తో మంత్రి కన్నా భేటీ.. రాజకీయాలపై చర్చ

Nov 23 2013 1:30 PM | Updated on Sep 17 2018 4:56 PM

గవర్నర్తో మంత్రి కన్నా భేటీ.. రాజకీయాలపై చర్చ - Sakshi

గవర్నర్తో మంత్రి కన్నా భేటీ.. రాజకీయాలపై చర్చ

గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. పావుగంట పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు.

గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. పావుగంట పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. సీమాంధ్ర ప్రాంతానికి కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ ప్రాంతానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ముఖ్యమంత్రులు అవుతారని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

కన్నా లక్ష్మీనారాయణను కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గతంలో ఢిల్లీ పిలిపించుకుని ఆయనతో చర్చించడం, ఇప్పుడు ఆయన గవర్నర్ నరసింహన్ను కలిసి వివిధ అంశాలపై పావుగంట పాటు చర్చించడం లాంటి అంశాలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.

Advertisement
 
Advertisement
Advertisement