స్కూల్‌ బస్సు ప్రమాదంపై సీఎం జగన్‌ ఆరా

Kadiri School Bus Accident: CM Jagan orders help to victims - Sakshi

సాక్షి, అమరావతి: కర్ణాటకలోని ఉడిపి వద్ద అనంతపురం జిల్లా కదిరి స్కూల్‌బస్సుకు ప్రమాదంపై ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ప్రమాద వివరాలను సీఎంవో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమేఊ సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే గాయపడ్డ వారికి చికిత్స అందించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు తిరిగి క్షేమంగా రావడానికి తగిన ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. కాగా బస్సు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

కాగా కర్ణాటక శివమొగ్గ జోగ్‌ఫాల్స్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ విద్యార్థులలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల వెంట వెళ్లిన టీచర్‌, వంట మనిషి కూడా గాయపడినట్లు సమాచారం. డ్రైవర్‌ మద్యం సేవించి నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పాఠశాల హెచ్‌ఎం రాజేంద్రన్‌ ‘సాక్షి’కి ఫోన్‌ ద‍్వారా తెలిపారు. ఈ నెల 2వ తేదీన కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులతో కలిసి 45మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. శుక్రవారం రోజంతా జోగ్‌ జలపాతం వద్ద ఆనందంగా గడిపారు. తర్వాత రాత్రిపూట బస చేసేందుకు మురిడి బయలుదేరగా మార్గంమధ్యలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ దారిగుండా వెళుతున్న ఇతర వాహనాల డ్రైవర్లు సమీపంలోని పోలీసులకు తెలియజేయడంతో వారు అనంతపురం జిల్లా ఎస్పీ సత్యాయేసుబాబుకు సమాచారం ఇచ్చారు. గాయపడినవారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

చదవండివిద్యార్థుల విహార యాత్ర.. ఘోర రోడ్డు ప్రమాదం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top