బాబూ ... మా పార్టీ అంటే ఎందుకంత భయం | Jyothula Nehru takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబూ ... మా పార్టీ అంటే ఎందుకంత భయం

Nov 1 2014 4:11 PM | Updated on Aug 18 2018 6:18 PM

బాబూ ... మా పార్టీ అంటే ఎందుకంత భయం - Sakshi

బాబూ ... మా పార్టీ అంటే ఎందుకంత భయం

రాష్ట్రంలో పరిపాలన రాక్షస పాలనను గుర్తు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు.

హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన రాక్షస పాలనను గుర్తు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆయన అభివర్ణించారు. శనివారం హైదరాబాద్లో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ...  ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలనే ప్రయాత్నంలో భాగంగానే భూమా నాగిరెడ్డిపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. మీ తప్పులను వేలేత్తి చూపిన మా పార్టీ వారిపై అక్రమకేసులు బనాయిస్తారా?  ఇది రాక్షసపాలన కాక మరేమంటారని వెల్లడించాలని అధికార టీడీపీని డిమాండ్ చేశారు.

ఒక విద్యార్థి మృతికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కుమారుడు సిద్దార్ద కారకుడంటూ మీడియాలో కథనాలు వచ్చిన తర్వాతే అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవం కాదా అని జ్యోతుల నెహ్రు సూటిగా ప్రశ్నించారు. అయినా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకంత భయమో అర్థం కావడం లేదని చంద్రబాబును ఉద్దేశించి జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement