చేవెళ్ల డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా | job mela in chevella degree college | Sakshi
Sakshi News home page

చేవెళ్ల డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా

Nov 30 2013 5:01 AM | Updated on Mar 28 2018 10:59 AM

చేవెళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పూర్వ విద్యార్థులకు యురేకా ఫోర్‌‌బ్స కంపెనీ జాబ్‌మేళా నిర్వహించింది.

చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్:  చేవెళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పూర్వ విద్యార్థులకు యురేకా ఫోర్‌‌బ్స కంపెనీ జాబ్‌మేళా నిర్వహించింది. పలువురు విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంది. ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రావణ్‌కుమార్ అన్నారు. కళాశాలలో చదువుకుని, ఆ తర్వాత ఖాళీగా ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. జాబ్‌మేళాకు హాజరైన విద్యార్థులు యురేఖ ఫోబ్స్ కంపెనీ ప్రతినిధులు అయ్యప్ప, ఎండీ రఫీయోద్దీన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన వారు డిసెంబర్ 2వతేదీలోపు జాబ్‌లో జాయిన్ కావాలని వారు చెప్పారు.  
 కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్
 కొందరు విద్యార్థినులు కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. పలు రకాల సాంప్రదాయ వంటకాలను ఇందులో ఉంచారు. ఫుడ్‌ఫెస్టివల్‌లో వంటకాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వెంకటరమణ, శ్రీలక్ష్మి, జ్యోతీర్మయి, సుజాత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement