కళకళలాడాల్సిన రాష్ట్రాన్ని టీడీపీ నేతలు, వారి అనుచరులు హత్యారాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్నారని గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఐవీ రెడ్డి ధ్వజమెత్తారు.
కళకళలాడాల్సిన రాష్ట్రాన్ని టీడీపీ నేతలు, వారి అనుచరులు హత్యారాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్నారని గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఐవీ రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణ హత్యను ఆయన ఖండించారు.
రాజకీయంగా ఎదుగుతూ పట్టు సాధిస్తున్న క్రమంలో ఆయన ఎదుగుదలను ఓర్వలేక.. నిరాయుధుడిగా ఉన్న సమయంలో ఇలా హత్యకు తెగబడటం చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలను పోలీసుల సాక్షిగా బాబు, లోకేష్ సమాధి చేసినట్టు మరోసారి రుజువయ్యిందని, ఇంతటి అరాచక ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలోను చూసి ఉండరని ఆయన మండిపడ్డారు. బాబు సర్కార్ ప్రోత్సహిస్తున్న హత్యా రాజకీయాలకు ప్రజలు చెల్లుచీటీ పలికే తరుణం దగ్గరలోనే ఉందని చెప్పారు. చెరుకులపాడు నారాయణరెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఐవీ రెడ్డి గుర్తు చేసుకున్నారు.