సర్వేయర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | Invite applications for the post Surveyor | Sakshi
Sakshi News home page

సర్వేయర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Aug 19 2015 1:11 AM | Updated on Sep 3 2017 7:40 AM

శృంగవరపుకోట: మండలంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచే సేందుకు సర్వేయర్ పోస్టులకు దరఖాస్తులు అహ్వానిస్తున్నట్టు తహశీల్దార్ రాములమ్మ చెప్పారు.

శృంగవరపుకోట: మండలంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచే సేందుకు  సర్వేయర్ పోస్టులకు  దరఖాస్తులు అహ్వానిస్తున్నట్టు తహశీల్దార్ రాములమ్మ చెప్పారు. అభ్యర్థులు ఐటీఐలో డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, లేదా పాలిటెక్నిక్ డిప్లమోలో సివిల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తులను స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి పంపాలని సూచించారు.
 
 మండలానికి 5 నుంచి 10 మంది అభ్యర్థులను ఎంపిక చేసి కలెక్టర్‌కు నివేదిక పంపుతామన్నారు. కలెక్టర్ ఎంపిక చేసిన వారికి,  విలువైన శిక్షణ  60 రోజులు పాటు ఇచ్చిన తర్వాత, రాతపరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మండలానికి ఇద్దరిని పోస్టు చేస్తామన్నారు. వీరికి నెలకు రూ. 5000 నుంచి రూ.6000 వరకూ గౌరవభృతి ఇస్తారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement