ప్రజలతో ఎలా వ్యవహరిస్తారు..? | Sakshi
Sakshi News home page

ప్రజలతో ఎలా వ్యవహరిస్తారు..?

Published Fri, Jul 12 2019 10:24 AM

Interviews of village volunteers in thamballapalle constituency - Sakshi

బి.కొత్తకోట:  ప్రజలతో మమేకం అయ్యేలా వారితో ఎలా వ్యవహరిస్తారు, ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు అంటే ఏమిటి అన్న ప్రశ్నలతో అధికారులు వలంటీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో కోటావూరు, బండారువారిపల్లె, శీలంవారిపల్లె పంచాయతీలకు చెందిన వలంటీర్‌ అభ్యర్థులకు మండల ప్రత్యేక అధికారి శివశంకర్, ఎంపీడీఓ సుధాకర్, డెప్యూటీ తహసీల్దార్‌ చంద్రమునిలు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 100 మార్కులకు   ప్రశ్నలు వేశారు.

 ములకలచెరువు: గ్రామ వలంటీర్ల కోసం దరఖాస్తులు చేసుకున్న గూడుపల్లి, వేపూరికోట, కదిరినాథునికోట పంచాయతీ అభ్యర్థులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ తాజ్‌మస్రూర్‌ గురువారం అన్నారు. మొత్తం 60 మందికి ఇంటర్వ్యూలు జరుగుతాయని అభ్యర్థులకు కేటాయించిన సమయానికి ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఎంపీడీఓ పేర్కొన్నారు. స్థానిక మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం జరిగిన గ్రామ వలంటీర్లకు జరిగిన ఇంటర్వ్యూల్లో 28 మంది హాజరయ్యారు. కాలువపల్లి, నాయనచెరువుపల్లెకు చెందిన 30 అభ్యర్థులకు గాను ఇద్దరు గైర్హాజరయ్యారు.  

పెద్దతిప్పసముద్రం: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం అంకిరెడ్డిపల్లి, బూచిపల్లి, సంపతికోట గ్రామాలకు చెందిన అభ్యర్థులకు వలంటీర్ల నియామకాలపై ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ రెడ్డెప్ప,  ఈఓఆర్డీ పద్మారాణి అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. శుక్రవారం మండలంలోని కాట్నగల్లు, రాపూరివాండ్లపల్లి, సంపతికోట గ్రామాల్లో దరఖాస్తు చేసుకుని వారి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లతో పాటు ఇంటర్వ్యూకు రావాలని ఫోన్‌ వచ్చిన వారు మాత్రమే హాజరు కావాలని అధికారులు కోరారు.

తంబళ్లపల్లె: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు జరిగాయి. దిగువపాళ్యం, ఎగువసుగాలి తాండా, కన్నెమడుగు, మర్రిమాకుపల్లె, ఎర్రసానిపల్లె పంచాయతీల్లో 30 మంది దరఖాస్తుదారులకు గానూ 22 మంది మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 8 మంది గైర్హాజరైనట్లు డీటీ సుధాకర్‌బాబు తెలిపారు.   

Advertisement
Advertisement