ఇంటర్ సప్లిమెంటరీ ఏర్పాట్లు పూర్తి | Inter supplementary arrangements | Sakshi
Sakshi News home page

ఇంటర్ సప్లిమెంటరీ ఏర్పాట్లు పూర్తి

May 18 2014 1:14 AM | Updated on Sep 2 2017 7:28 AM

ఇంటర్ సప్లిమెంటరీ ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ సప్లిమెంటరీ ఏర్పాట్లు పూర్తి

జిల్లాల్లో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వాహ ణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షల్లో 21,142 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్దమయ్యూరు.

విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాల్లో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వాహ ణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షల్లో 21,142 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్దమయ్యూరు. ఈ నెల 25 నుంచి జూన్ ఒకటి వరకు జరిగే ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ ఇంటర్ విద్యార్థులు 14,454 మందిలో బెటర్‌మెంట్ కోసం 6,792 మంది, ఫెయిల్యూర్స్ 7,662 మంది పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ రెండవ సంవత్సర విద్యార్థులు 9,911 మంది ఉన్నారు. ప్రథమ సంవత్స ర పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 గంట ల వరకు, రెండవ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గంటల వరకు జరగనున్నారుు.
 
 19న పర్యావరణ పరీక్ష : ఆర్‌ఐఓ బాబాజీ
 ఇంటర్‌లో పర్యావరణ సబ్జెక్టు పరీక్ష రాయని వారికి అవకాశం ఇస్తూ ఈ నెల 19న పరీక్ష నిర్వహిస్తున్నామని ఆర్‌ఐఓ ఎల్‌ఆర్‌బాబాజీ ‘న్యూస్‌లైన్’కి చెప్పారు. గతంలో పరీక్షకు హాజరుకా ని వారు నేరుగా ఆ రోజు కళాశాలలకు వెళ్లి పరీ క్షకు హాజరుకావచ్చని తెలిపారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను పదింటిని గుర్తించామని, వీటితో పాటు అన్ని కేంద్రాల్లో  ప్రశాంతంగా  పరీక్షలను నిర్వహించడానికి 144వ సెక్షన్ విధిస్తున్నామని ఆర్‌ఐఓ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement