breaking news
rio Babaji
-
ఇంటర్ సప్లిమెంటరీ ఏర్పాట్లు పూర్తి
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాల్లో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వాహ ణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షల్లో 21,142 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్దమయ్యూరు. ఈ నెల 25 నుంచి జూన్ ఒకటి వరకు జరిగే ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ ఇంటర్ విద్యార్థులు 14,454 మందిలో బెటర్మెంట్ కోసం 6,792 మంది, ఫెయిల్యూర్స్ 7,662 మంది పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ రెండవ సంవత్సర విద్యార్థులు 9,911 మంది ఉన్నారు. ప్రథమ సంవత్స ర పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 గంట ల వరకు, రెండవ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గంటల వరకు జరగనున్నారుు. 19న పర్యావరణ పరీక్ష : ఆర్ఐఓ బాబాజీ ఇంటర్లో పర్యావరణ సబ్జెక్టు పరీక్ష రాయని వారికి అవకాశం ఇస్తూ ఈ నెల 19న పరీక్ష నిర్వహిస్తున్నామని ఆర్ఐఓ ఎల్‌ఆర్‌బాబాజీ ‘న్యూస్‌లైన్’కి చెప్పారు. గతంలో పరీక్షకు హాజరుకా ని వారు నేరుగా ఆ రోజు కళాశాలలకు వెళ్లి పరీ క్షకు హాజరుకావచ్చని తెలిపారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను పదింటిని గుర్తించామని, వీటితో పాటు అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్షలను నిర్వహించడానికి 144వ సెక్షన్ విధిస్తున్నామని ఆర్ఐఓ చెప్పారు. -
ప్రైవేట్ కాలేజీల ఫీజులుం
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్:ప్రైవేట్ కళాశాలల అక్రమాలకు అంతేలేకుండా పోతోం ది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అనవసర భయాన్ని అలుసు గా చేసుకుని కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఇష్టానుసారం దోచుకుంటున్నాయి. పరీక్ష రుసుమును సైతం తమకు నచ్చిన విధంగా పలు అన్ ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు వసూలు చేస్తున్నా యి. పభుత్వం ప్రకటించిన ఫీజుకు మూడు రెట్లు అదనంగా ముక్కుపిండి మరీ గుంజుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అవస్థలకు గురికావలసి వస్తోంది. ఇంటర్మీడియెట్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.300 మాత్రమే చెల్లించవలసి ఉండగా యాజమాన్యాలు బలవంతంగా రూ.వెయ్యి వరకూ వసూలు చేస్తున్నాయి. సైన్స్ విద్యార్థులైతే పరీక్ష ఫీజు, ప్రాక్టికల్ రుసుముతో కలిపి రూ.400 చెల్లించాల్సి ఉండగా వారి వద్ద నుంచి రూ.1200 వసూలు చేస్తున్నారు. ఈ విధంగా జిల్లాలోని అన్ఎయిడెడ్ కళాశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి లెక్కలు వేస్తే దాదాపు కోట్లలోనే వసూళ్ల దందా సాగుతోందని చెప్పాలి. జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరంలో 22 ప్రభుత్వ, 5 ఎయిడెడ్, 78 అన్ఎయిడెడ్ కళాశాల్లో మొత్తం 48,105 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 23,847 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా, 23,625 వేల మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు. పభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో నిర్ణీత పరీక్ష ఫీజునే వసూలు చేస్తుండగా అన్ఎయిడెడ్ కళాశాలలు మాత్రం అందు కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. రెండు సంవత్సరాలకు కలుపుకొని అన్ఎయిడెడ్ కళాశాలల్లో 25 వేల మంది విద్యార్థులున్నారు. వీరి వద్ద నుంచి మూడు రెట్లు అదనంగా పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం సైన్స్ విద్యార్థుల(ఎంపీసీ, బైపీసీ) నుంచి ప్రాక్టికల్స్ ఫీజులను కూడా ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ప్రాక్టికల్స్ ఫీజుగా ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేయాల్సి ఉండగా నిర్బంధంగా రూ.200 వసూలు చేస్తున్నారు. ప్రాక్టికల్స్ బూచి చూపి.. ప్రయోగ పరీక్షల బూచి చూపి సైన్స్ విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మేం చెప్పే విధంగా ఫీజు చెల్లిస్తే ప్రాక్టికల్స్‌లో మంచి మార్కులు వచ్చేలా ‘మేనేజ్’ చేస్తామని, లేకపోతే మీ ఇష్టమని భయపెడుతున్నారు. సైన్స్ విద్యార్థులు ఎంపీసీ అయితే 60 మార్కులకు, బైపీసీఅయితే 120 మార్కులకు వివిధ సబ్జెక్టుల ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ మార్కులు వారికి కీలకం. ఈ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేలా, రాత పరీక్షలో సాయం చేసేందుకు అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు కొన్ని కాలేజీల యాజమాన్యాలు తల్లిదండ్రులకు చెబుతున్నాయని సమాచారం. అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు ఆర్ఓ బాబాజీ హెచ్చరిక ఇంటర్మీడియెట్ విద్యార్థుల నుంచి బోర్డు నిర్దేశించిన ఫీజునే వసూలు చేయాలి. పరీక్ష ఫీజు పేరుతో కళాశాలల యాజమాన్యాలు అక్రమంగా వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్ఐఓ) ఎల్.ఆర్. బాబాజీ హెచ్చరించారు. అదనపు ఫీజులు వసూలు చేసే కళాశాలల గురించి తమకు ఫిర్యాదు చేస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు తనకు కొందరు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.