నాన్నే నాకు స్ఫూర్తి | inspire in my Daddy, says MS Narayana daughter Sashikiran | Sakshi
Sakshi News home page

నాన్నే నాకు స్ఫూర్తి

Jan 23 2015 11:55 AM | Updated on Sep 2 2017 11:01 AM

పేరొందిన హాస్య నటుడి కుమార్తె అయినా ఆమె దృష్టి మాత్రం ఎప్పుడూ దర్శకత్వంపైనే. విలువలతో కూడిన సినిమా తీయూలనే తపనపైనే.

  • దర్శకురాలు శశికిరణ్
  • పేరొందిన హాస్య నటుడి కుమార్తె అయినా ఆమె దృష్టి మాత్రం ఎప్పుడూ దర్శకత్వంపైనే. విలువలతో కూడిన సినిమా తీయూలనే తపనపైనే. ఇలా.. ఎన్నో రోజులుగా ఆమె కన్న కలలు ఇప్పటికి         నెరవేరాయి. ‘సాహెరా సుబ్రహ్మణ్యం’ అనే విభిన్న ప్రేమకథతో ప్రత్యేకమైన సినిమా తీశారు. సినీ రంగంలోనైనా.. నిజజీవితంలోనైనా నాన్నే నా స్ఫూర్తి అంటున్న ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్‌తో ‘సాక్షి’ చిట్‌చాట్.
     
     ప్రశ్న : సినిమాలపై మక్కువకు కారణం..
     జ : నా చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. ప్రతి సినిమాను విశ్లేషణాత్మకంగా చూస్తాను. ఆ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అన్వేషిస్తాను. నాన్న ప్రోత్సాహంతో సినీ రంగాన్ని ఎంచుకున్నాను.
     
     ప్రశ్న :  మీకు నచ్చిన దర్శకులు..
     జ :  నాన్నతో పాటు ప్రియద ర్శన్,  కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు.. ఇంకా చాలామందే ఉన్నారు.
     
     ప్రశ్న : సినీరంగంలో మీ అనుభవం..
     జ : ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ సినిమాలో ప్రముఖ నటులు నరేష్, రావు రమేష్ వంటి వారిని డెరైక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ నాకు చాలా సహకరించారు. అన్ని సన్నివేశాలు బాగా పండాయి.
     
     ప్రశ్న : ఏ తరహా చిత్రాలంటే ఇష్టం..

     జ : సమాజానికి ఎంతో కొంత మెసేజ్ ఇచ్చే సినిమాలను ఇష్టపడతాను. అలాంటి సినిమాల ద్వారా ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారు. నేను కూడా నా సినిమాలో ఓ సందేశం ఇవ్వనున్నాను. మన సంస్క­తీ సంప్రదాయూలు ఇనుమడించేలా సన్నివేశాలు ఉంటాయి.
     
    ప్రశ్న : మీకు ఆదర్శం ఎవరు..
    జ :  కచ్చితంగా మా నాన్నే. నా ఎదుగుదలకు, అభివృద్ధికి ఆయనెంతో కారణం. ఆయనే నాకు స్ఫూర్తి. ఎప్పటికీ ఆయన బాటలోనే నడుస్తా..
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement