తడారిపోతున్న.. ఎడారి బతుకులు..

indians problems faced in saudi and gulf countries - Sakshi

గల్ఫ్‌ దేశాల్లో అష్టకష్టాలు పడుతున్న జిల్లా వాసులు

ఏజెంట్ల మోసాలకు బలవుతున్న వైనం

ఆశల లోకం.. బతుకు దుర్భరం. ఆనందంగా వెళుతున్నారు. కన్నీటితో తిరిగొస్తున్నారు. పొట్లకూటì  కోసం ఎడారి దేశాలకు వెళుతున్న వారి కన్నీళ్లూ ఇంకిపోతున్నాయి. సొంత ఊళ్లో తిండికి జరిగే దారిలేక.. పొట్ట చేత పట్టుకొని ఎడారుల వెంట అదృష్టాన్ని వెతుక్కోడానికి వెళుతున్నారు. గల్ఫ్‌ దేశాలకు ఏటా జిల్లా నుంచి వందల సంఖ్యలో వెళుతున్నారు. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొందరి జాడే కనిపించడం లేదు. ఈ అభాగ్యుల పట్ల స్పందించేవారే లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. బాధితుల్లో పశ్చిమ మండలాల వారే అధికం.

చిత్తూరు, సాక్షి: గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మన వాళ్లకు అక్కడకు వెళ్లి వచ్చిన కష్టాలు.. కన్నీళ్లతో పని లేదు. వెళ్లిన వాళ్లు వస్తూనే ఉన్నారు. కొత్తవాళ్లు వెళుతూనే ఉన్నా రు. ఎందుకంటే ఏదో విధంగా సంపాదించాలనే ఆశ... సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లిపోతోంది. లక్షలు అప్పో సొప్పో చేసి వెళ్లే వాళ్లు ఎంతో మంది.. ఏజంట్ల మాయలో పడి బతుకు బండిని తాకట్టు పెట్టేస్తున్నారు. దుబాయ్, ఇరాక్, సౌదీ అరేబియా లాంటి దేశాలకు వెళ్లి కష్టాలు పడుతున వారికి లెక్కేలేదు. అక్కడకు వెళ్లిన తరువాత సంపాదన లేక, కుటుంబ సభ్యులకు సమాచారం అందించలేక తీవ్ర మ నోవేదనకు గురవుతున్నారు. చివరకు విగత జీవులుగా మారిపోతున్నారు. విషయం తెలిసినా తమ వాళ్లను రప్పించుకునేందుకు కుటుంబ సభ్యులు నానా కష్టాలు పడుతున్నారు.

ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
ఇంతగా కష్టాలు పడుతున్నా ప్రభుత్వం దాఖలాలు అసలే లేవు. బాధితులు కేసులు పెడితే పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఆ తరువాత సంగతే మరిచిపోతారు. ఇలా రోజురోజుకూ గల్ఫ్‌ దుర్భ ర జీవితాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం స్పందిస్తే తప్పితే బాధితులకు కష్టాలు తీరవు. కాగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వాళ్లలో ఎక్కువ మంది మధ్య తరగతి వారే ఉంటున్నారు. వచ్చింది సరిపోక.. ఎవరినీ చేయి చాచి అడగలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏదో సంపాదిద్దామని వెళ్లి ఆరోగ్యంతో సహా అన్నీ పోగొట్టుకొని తిరిగి వస్తున్నారు.

ఇదిగో సాక్ష్యాలు..
మదనపల్లె మండలం కొత్త ఇండ్లు, నీరుగుట్టపల్లి ఘటనలే నిదర్శనం. కొత్త ఇండ్లుకు రఘునాథ భార్య రాణి ఘటనలే నిదర్శనం. రాణి సౌదీకి వెళ్లిన పది రోజులకే అక్కడి అరబ్‌ షేక్‌లు పెట్టే బాధలు భరించలేక చనిపోయింది. నీరుగుట్టవారిపల్లికి చెందిన మంజునాథ్‌ చేనేత కార్మికుడు. రాబడి లేక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఇళ్లు గడవడం గగనంగా మారింది. దీంతో భార్య హేమలత(25)ను సౌదీ అరేబియాకు పంపాడు. అక్కడి షేక్‌లు చిత్రహిసలు భరించలేక అక్కడే ఉరేసుకొని చనిపోయింది. మృతదేహాన్ని ఇక్కడి పంపించా లంటే రూ.1.50 లక్షలు చెల్లిస్తేనే పంపిస్తామని ఖరాకండిగా చెప్పడంతో అడిగినంత ముట్టజెప్పి మృతదేహాన్ని తెప్పించుకున్నారు.

హెల్ప్‌లైన్‌.. కావాలి..
జిల్లాలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని బాధితులు చెబుతున్నారు. గతేడాది గల్ఫ్‌లో చనిపోయిన వారిలో క డప, చిత్తూరు జిల్లాల వారేఎక్కువగా ఉన్నారని వాపోతున్నారు.

జీవితం అధ్వానంగా..
సుధాకర్‌ మదనపల్లిలో కారు డ్రైవర్‌. నెలకు రూ.12 వేల వరకు సంపాదిస్తాడు. అయితే తనతో పాటు పని చేసిన స్నేహితులం దరూ దుబాయ్‌కు వెళ్లి బాగా స్థిరపడ్డారు. అందుకే సుధాకర్‌ కూ డా అలాగే చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ జీతం కేవలం రూ.16 వేలు. మదనపల్లిలో ఉన్నపుడు రూ.12 వేలు సంపాదించేవాడు. దుబాయ్‌ వెళితే రూ.4 వేలు పెరిగింది. అక్కడ యజమాని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలి. టైమ్‌ అంటూ ఏమీ ఉండదు. ఎక్కడకు వెళ్లనికి కూడా అవకాశం ఉండదు.  సెలవులు కూడా ఉండవు. కుటుంబ సభ్యులకు దూరమై దేశం కాని దేశంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అక్కడికి వెళ్లిన ఆరు నెలలకే అనారోగ్యం పాలయ్యాడు. చేతిలో పైసా లేకుండా తిరిగొచ్చాడు. చేసిన అప్పులు కూడా అలానే ఉన్నాయి. వడ్డీలు పెరుగుతున్నాయని వాపోతున్నాడు.

చిత్రహింసలు పెడుతున్నారు..
‘ఎంతో ఆనందంగా సౌదీకి వచ్చా. రోజుకు 8 గంటలు మాత్రమే  పని అని చెప్పి తీసుకొచ్చారు. 18 గంటలు చేయిం చుకుంటున్నారు. అయినా కష్టపడి పని చేస్తున్నా. జీవితంలో ఏదో విధంగా స్థిరపడాలని వాళ్లు పెట్టిన కష్టాలన్నీ దిగమింగుతున్నా. ఇక తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. సంవత్సరం నుంచి ఒక్కపైసా జీతం ఇవ్వలేదు. నేను ఇంటికీ పంపించ లేదు. ఉన్నదంతా తాకట్టుపెట్టి వచ్చా. ఇండియాకు పంపాలని కాళ్లావేళ్లా పడుతు న్నా ఏజెంట్లు కనికరించడం లేదు. ప్రభుత్వమే సహాయం చేయాలి’ అని సౌదీ అరేబియా నుంచి కోరుతోంది.– రాజమ్మ, బాటవారిపల్లె హరిజనవాడ, కేవీపల్లె మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top