ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటలు విద్యుత్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ నుంచి 240 మిలియన్ డాలర్లు, ఏఐఐబీ నుంచి 160 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంది.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటలు విద్యుత్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ నుంచి 240 మిలియన్ డాలర్లు, ఏఐఐబీ నుంచి 160 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ తరఫున ఆపరేషన్స్ మేనేజర్ హిషం అబ్డో, ఏఐఐబీ ఉపాధ్యక్షుడు డీజే పాండ్యన్ గురువారం సంబంధిత ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమం అమలు ఒప్పందంపై ఏపీ ప్రభుత్వ విద్యుత్ సలహాదారు కె.రంగనాథం, ప్రపంచ బ్యాంక్, ఏఐఐబీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 570 మిలియన్ డాలర్లు కాగా, మిగిలిన వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.