శ్రీవారి సేవలో వెంకయ్యనాయుడు | Impressed by the pitch | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో వెంకయ్యనాయుడు

Jun 1 2014 3:39 AM | Updated on Sep 2 2017 8:08 AM

శ్రీవారి సేవలో వెంకయ్యనాయుడు

శ్రీవారి సేవలో వెంకయ్యనాయుడు

తిరుమల శ్రీవారిని శని వారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దర్శిం చుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా వైకుం ఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లా రు.

తిరుమల, న్యూస్‌లైన్: తిరుమల శ్రీవారిని శని వారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దర్శిం చుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా వైకుం ఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లా రు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నా రు. అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శిం చుకున్నారు. వీరికి టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

ఆలయ రంగనాయక మండపంలో శ్రీవారి లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. వీరితో పాటు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఉన్నారు. టీడీపీ నేత అంబికా కృష్ణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement