కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి ఆలయ భద్రతపై రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి ఆలయ భద్రతపై రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతే కాకుండా శ్రీవారి ఆలయ మాడ వీధులలో భద్రతా నిర్వహణను ఆయన స్వయంగా పరిశీలించారు. అంతకు రాజీవ్ రతన్, డీఐజీ బాలకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు.
కాగా నవంబర్ 29 నుంచి జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహోత్సవాల భద్రతపై రాజీవ్ రతన్,అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ నిన్న సమీక్ష జరిపారు.ఇటీవలి చిత్తూరు జిల్లాలో ఉగ్రవాదులు పట్టుబడిన విషయం తెలిసిందే. తిరుమలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారనే నేపథ్యంలో భద్రతపై అధికారులు ప్రత్యక దృష్టి పెట్టారు.