రాష్ట్రం విడిపోతే సీమ ఏడారే | If state divide means Rayalaseema will on trouble | Sakshi
Sakshi News home page

రాష్ట్రం విడిపోతే సీమ ఏడారే

Sep 27 2013 2:48 AM | Updated on Sep 1 2017 11:04 PM

రాష్ట్ర విభజనను పాలకులు, అధికారులు, ప్రజలు సమైక్య గళం విప్పి అడ్డుకోకపోతే భావి తరాలు క్షమించవని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు అన్నారు. రాయలసీమ నీటి వనరులు-లభ్యత-అభివృద్ధి-విభజన నష్టాలు-తదుపరి చర్యలు-ప్రణాళిక అనే అంశంపై గురువారం కర్నూలులో రాయలసీమ నీటి పారుదల శాఖ ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు.

కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను పాలకులు, అధికారులు, ప్రజలు సమైక్య గళం విప్పి అడ్డుకోకపోతే భావి తరాలు క్షమించవని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు అన్నారు. రాయలసీమ నీటి వనరులు-లభ్యత-అభివృద్ధి-విభజన నష్టాలు-తదుపరి చర్యలు-ప్రణాళిక అనే అంశంపై గురువారం కర్నూలులో రాయలసీమ నీటి పారుదల శాఖ ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు.
 
 ఇరిగేషన్ ఇంజినీర్ల జేఏసి జిల్లా కన్వీనర్ పాండు రంగయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో చీఫ్ ఇంజినీర్‌సుబ్బారావు, సూపరింటెండెంట్ ఇంజి నీర్ నాగేశ్వరరావు, రాయలసీమ ఇంజినీర్ల జేఏసీ కన్వీనర్ సుధాకర్‌బాబు హాజరయ్యారు. ఇందు లో అనంతపురం, కడప, చిత్తూరు జేఏసీ కన్వీనర్లు శ్రీనివాసరెడ్డి, క్రిష్ణయ్య, మురళి, నంద్యాల సర్కిల్  జేఏసీ అధ్యక్షుడు చెన్నప్పరెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ మనోహర్, రిటైర్డ్ డీఈ సుబ్బరాయుడు ప్రసంగించారు.
 
 రాష్ట్రాన్ని విభజిస్తే సీమ ఎడారిగా మారుతుందని, వరద జలాల ఆధారితమై నిర్మించిన గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టుకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. టీబీ డ్యాం నుంచి దిగువ కాల్వకు సమాంతర కాలువ తవ్వేందుకు కేంద్రం అనుమతివ్వాలన్నారు. పోలవరం, దుమ్ముగూడెం ప్రాజెక్టులను పూర్తి చేసి 242 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణ బేసిన్‌కు తరలించి ఆ నీటిని వరద ఆధారిత ప్రాజెక్టులైన హంద్రీనీవా, గాలేరు, తెలుగు గంగ, ఎస్సార్బీసీ, వెలుగొండ ప్రాజెక్టులకు నికర జలాలుగా కేటాయించాలన్నారు. అనంతరం సదస్సులో 10 తీర్మానాలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement