భయంతో పరుగులు..

Hospital Slab Splashes Blown Down At Main Hall Of Maternity Department In Tekkali - Sakshi

సాక్షి, టెక్కలి రూరల్‌(శ్రీకాకుళం) : టెక్కలి జిల్లా ఆస్పత్రిలోని ప్రసూతి విభాగం ప్రధాన హాల్‌లో శ్లాబ్‌ పెచ్చులు ఊడాయి. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు నందిగాం గ్రామానికి చెందిన సరిత వచ్చారు. శ్లాబ్‌ పెచ్చులు ఊడి ఆమె ముందు పడటంతో ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న పలువురు స్వల్పగాయాలతో బయటపడినట్లు రోగులు తెలిపారు. గర్భిణులతోపాటు అప్పుడే పుట్టిన శిశువులు సైతం వార్డుల్లోకి తీసుకువెళుతూ రద్దీగా ఉండే చోట ఈ విధంగా పెచ్చులు ఊడి పడటంతో రోగులు ఆందోళనకు గురవుతున్నారు. రెండు రోజులు క్రితం కూడా గర్భిణిపై పెచ్చులూడిపడినట్లు రోగులు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం హయంలో ఆస్పత్రి మరమ్మతులకు సుమారు రూ.40లక్షలు, రంగులు వేసేందుకు రూ.20 లక్షలు వెచ్చించారు. కాంట్రాక్టర్‌ చేపట్టిన పనుల్లో నాణ్యతలేకపోవడంతో నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెను ప్రమాదం జరగక ముందే మరమ్మతులు చేపట్టాలని రోగులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top