అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీగా ఈదురుగాలులు వీచడంతో పట్టణంలో పలు చోట్ల పెద్ద ఎత్తున చెట్లు రోడ్లపై నేలకొరిగాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మున్సిపల్ అధికారులు చెట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.