'పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తాం'

Health Minister Alla Nani Says We Give High Priority For Healing Of Poor - Sakshi

మంత్రి ఆళ్ల నాని

సాక్షి, తిరుపతి : పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిని శనివారం మంత్రుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా రోగులను పరామర్శించిన మంత్రులు వారి​కి అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక వసతుల ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. రుయా ఆసుపత్రి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళతామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, ఆదిమూలపు సురేశ్‌, ఇతర ఉన్నతాదికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top