
పురందేశ్వరి ప్రకటనను స్వాగతిస్తున్నాం: హరీశ్
ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని సీఎం కిరణ్ సీమాంధ్ర సెక్రటేరియట్‌గా మారుస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.
యాదగిరికొండ: ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని సీఎం కిరణ్ సీమాంధ్ర సెక్రటేరియట్‌గా మారుస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రకు చెందిన ఫైళ్లు వేగంగా క్లియర్ అవుతుండగా.. తెలంగాణ ఫైళ్లు మాత్రం చూసేవారు లేక పేరుకుపోతున్నాయన్నారు.
తెలంగాణ ఉద్యమం... త్యాగాల మయం, కానీ సీమాంధ్ర ఉద్యమానికి చరిత్రే లేదని, అదంతా కృత్రిమమని ఆయన అభివర్ణించారు. కేంద్ర మంత్రి పురందేశ్వరి తెలంగాణ రావడం ఖాయమని చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. సీఎం కిరణ్ ధన పిశాచిలాగా మారారని, శవాలపై పేలాలు ఏరుకునేందుకు కూడా వెనుకాడరని హరీశ్ దుయ్యబట్టారు. పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ మాట్లాడుతూ సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.