అంట్లు తోమాడు.. అడుక్కున్నాడు

Gulf Agent Cheat East Godavari Person Nagendhra - Sakshi

ఏజెంట్‌ మోసంతో దుబాయ్‌లో యువకుడి దుర్భర జీవనం

తూర్పుగోదావరి, అమలాపురం రూరల్‌: దుబాయ్‌లో మంచి పనిలో చేర్పిస్తానని ఆ యువకుడిని ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ నమ్మించి రూ.లక్షన్నర తీసుకుని దుబాయ్‌ పంపించాడు. అక్కడ రోడ్డు చెంత హోటల్‌లో కప్పులు, ప్లేట్లు కడిగే పనిలో చేర్చాడు. ఆ పనులు చేస్తే వచ్చే అరకొర జీతంలో కొంత మొత్తాన్ని అక్కడే ఉన్న ఏజెంట్‌ మరదలు లాక్కునేది. ఐటీఐ చదువుకుని బతుకు తెరువు కోసం ఎన్నో ఆశలతో వెళ్లిన ఆ యువకుడు అడుగడుగునా అష్టకష్టాలు పడ్డాడు. మండలంలోని బండార్లంక గ్రామానికి చెందిన పిల్లి నాగేంద్ర దీన గాథ ఇది.

నాగేంద్ర తండ్రి హేమసుందరరావు గతంలో బండార్లంకలో ఓ చిరు వ్యాపారంతో జీవించేవాడు. బతుకు తెరువు కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి హేమసుందరరావు కుటుంబం ఇటీవల వలస వెళ్లింది. అక్కడే నభీఖాన్‌ అనే గల్ఫ్‌ ఏజెంట్‌ పరిచయయ్యాడు. అప్పటి దాకా తనకు వచ్చిన మెకానిక్‌ పనితో కష్టపడుతూ తండ్రికి తోడై కాస్త సంపాదనలో ప డ్డాడు. ఏజెంట్‌ అరి చేతిలో వైకుంఠాన్ని చూపించి అతడిని దుబాయ్‌ పంపించే ఏర్పాట్లు చేశాడు. దుబాయ్‌లో తన మరదలు ఉంటుందని..అక్కడ అంతా ఆమె చూసుకుంటుందని ధైర్యం చెప్పాడు, నాగేంద్ర వద్ద రూ.లక్షన్నర తీసుకుని విజిట్‌ వీసాతో ఈ ఏడాది మే 29న విమానం ఎక్కించాడు.

అంట్లు తోమే పనిఅప్పగించారు
దుబాయ్‌లో దిగాక ఏజెంట్‌ మరదలు తొలుత రోడ్డు చెంత ఓ గ్యారేజ్‌లో హెల్పర్‌గా చేర్పించింది. అక్కడి పాకిస్తాన్‌ యువకుల వేధింపులు తాళ లేకపోయాడు. తర్వాత ఆమె రోడ్డు చెంత హోటల్‌ సర్వర్‌–కమ్‌–పాత్రలు శుభ్రం చేసే పనిలో పెట్టింది. విజిట్‌ వీసాతో పంపించినా అక్కడ పర్మినెంట్‌ వీసా ఇప్పిస్తానన్న ఏజెంట్‌ పట్టించుకోలేదు. వీసా గడువు ముగిసిపోయే పరిస్థితిలో.. చేసేది లేక పోలీసుల కంట పడకుండా భిక్షగాడి అవతారమెత్తాడు. కొంత సొమ్ము సమకూరాక వీసాను పొడిగించుకున్నాడు.

తండ్రి చొరవతో స్వదేశానికి..
కొడుకు దీనస్థితిని చూసి నాగేంద్ర తండ్రి హేమసుందరరావు చలించిపోయాడు. అప్పు చేసి విమా నం టికెట్‌ తీయించి కొడుకు క్షేమంగా స్వదేశానికి వచ్చేలా చేసుకున్నాడు. సత్తుపల్లిలో ఏజెంట్‌ను తండ్రిని పదే పదే తన కొడుకుని తిరిగి స్వదేశం వచ్చేలా చేయమని ఒత్తిడి తెచ్చినప్పుడు అతడిపై దాడి కూడా చేశాడు. అక్కడ న్యాయం జరగదేమోనన్న భయంతో సొంతూరు బండార్లంక వచ్చి అమలాపురం రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాడు చేశాడు. అయితే ఏజెంట్‌ది సత్తుపల్లి కాబట్టి అక్క డ ఫిర్యాదు చేయమని ఎస్సై గజేంద్రకుమార్‌ చె ప్పారు. దీంతో సత్తుపల్లి పోలీసుస్టేషన్‌లోనే ఫిర్యా దు చేయనున్నట్టు బాధితుడు నాగేంద్ర తెలిపాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top