ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవ రాముడు | grand clebrate to sriramanavami in ontimitta | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవ రాముడు

Mar 29 2015 3:13 AM | Updated on Sep 2 2017 11:31 PM

ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవ రాముడు

ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవ రాముడు

వైఎస్‌ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామునికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీరామనవమి, పోతన జయంతి ఉత్సవాలను ప్రారంభించారు.

ఒంటిమిట్ట: వైఎస్‌ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ  రామునికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీరామనవమి, పోతన జయంతి ఉత్సవాలను  ప్రారంభించారు. మూలవిరాట్‌కు అభిషేకం, ప్రత్యేక పూజలు జరిపారు. ధ్వజస్తంభ ప్రాంగణంలో సీతా రామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలను ఆశీనులను చేశారు.

ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యుల ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దంపతులు స్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. కేఈ ఉదయం కడపలో మాట్లాడుతూ ఒంటిమిట్ట అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేస్తుందన్నారు. అమరావతి కేంద్రంగా రాజధాని ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలని కోరుతున్నానన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement