మార్మోగిన హరినామస్మరణ


 మన్యంకొండ పుణ్యక్షేతం గోవింద నామస్మరణతో పులకించింది. ఆదివారం మన్యం కొండ బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సంప్రదాయం ప్రకారం మొదటిరోజు తిరుచ్చిసేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భజనలు,కోలాటాలతో భక్తులు స్వామివారిని కోటకదిరనుంచి కొండపైకి తీసుకొచ్చారు.

 

 దేవరకద్ర రూరల్, న్యూస్‌లైన్:  జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యం కొండ లక్షీ్ష్మవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆది వారం రాత్రి 10 గంటలకు అం గరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మన్యంకొండ సమీపంలోని కోటకదిర ఆళహరి వంశీయుల ఇంట్లో ప్రత్యేకపూజల అనంతరం స్వామివారిని మన్యంకొండపైకి పల్లకీలో ఊరేగింపుగా (తిరుచ్చిసేవ) తీసుకువచ్చారు. స్వామివారిని గుట్టపైకి తీసుకువచ్చి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సం దర్భంగా ఊరేగింపులో భక్తులు భజ నలు, కోలాటాలు వేశారు. భ క్తుల హరినామస్మరణతో కోటకదిర పులకించిపోయిం ది. పురోహితుల వేదమంత్రాలు, సన్నా యి వాయిద్యాలు, బ్యాండు మేళతాళాల మధ్య స్వామివారి మధ్య పల్లకీసేవ ముం దుకు కదిలింది. ఊరే గింపులో మహిళలు పెద్దఎత్తున బొడ్డెమ్మలు వేశా రు. పెద్దఎ త్తున భక్తులు బాణాసంచా కా ల్చారు. కో టకదిర నుంచి కాలిబాటన స్వామివారి ని కాగడాల వెలుతురులో ఊరేగిస్తూ ప ల్లకీలో దాదాపు నాలుగు కిలోమీటర్ల దూ రంలో ఉన్న మన్యంకొండ గుట్టపైకి తీ సుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అ నంతరం ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

 

 నేడు సూర్యప్రభ వాహనసేవ

 మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వా మి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో భాగం గా సోమవారం స్వామివారి సూర్యప్రభ వాహనసేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ని గర్భగుడి నుంచి మండపం వరకు సూ ర్యప్రభ వాహనంలో పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య తీసుకొస్తారు. అక్కడ ప్రత్యేక పూ జలు చేసిన అనంతరం మళ్లీ స్వామివారిని సూర్యప్రభ వాహనంలో గర్భగుడిలోకి తీసుకెళ్తారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఆళహరి నారాయణస్వా మి, ఈఓ రాఘవేందర్‌రావు, దేవస్థానం సిబ్బంది, పురోహితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top