ప్రధానపార్టీలకు ఆశావహుల బెదిరింపులు నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పార్టీ పెద్దలకు కంటి నిండా కునుకు కరవైంది.
టికెట్ ఇస్తారా...లేదా..?
Mar 14 2014 12:21 AM | Updated on Sep 2 2017 4:40 AM
ప్రధానపార్టీలకు ఆశావహుల బెదిరింపులు నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పార్టీ పెద్దలకు కంటి నిండా కునుకు కరవైంది. టికెట్ ఇస్తారా..లేదా..వేరే పార్టీ వాళ్లు పోటీ చేయమని అడుగుతున్నారు..అంటూ ప్రధాన పార్టీల అధినేతలకు బెదిరింపులు మొదలయ్యాయి. ఇలా పట్టణంలోని పలువురు అభ్యర్థులు నామినేషన్‌కు ఒక్కరోజే సమయం ఉండడంతో వేరేపార్టీల వైపు చూస్తున్నారు. కొంతమంది ఆయా పార్టీలు బి.ఫారం ఇవ్వకపోయినా స్వతంత్రులుగా బరిలోకి దిగుతున్నారు. తరువాత ఆయా పార్టీల నుంచి పిలుపు వస్తే టికెట్ ఇస్తే బరిలో ఉండడం లేకపోతే నామినేషన్ ఉపసంహరణ సమయంలో ఏదో ఒక బేరానికి రాకపోతారా? అన్న ఆశతో ఉన్నారు. ఇలా రెండు ప్రధాన పార్టీల వద్ద బేరసారాలు నడిపి రెంటికీ చె డిన ఇద్దరు వ్యక్తులు చివరకు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.
-న్యూస్‌లైన్,చిలకలూరిపేట
Advertisement
Advertisement