వైఎస్‌ఆర్‌ సీపీలోకి గిద్దలూరు కౌన్సిలర్లు | giddaluru councillors and others join ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ సీపీలోకి గిద్దలూరు కౌన్సిలర్లు

Apr 26 2017 3:50 PM | Updated on Jul 25 2018 4:42 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి.

గిద్దలూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ప్రజానేతగా జనం గుండెల్లో చిరకాలం అమరుడిగా నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను తన భుజ స్కందాలపై మోస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకుని పలువురు గిద్దలూరు నియోజకవర్గ ప్రముఖులు బుధవారం  వైఎస్ఆర్ పార్టీలో చేరారు. కౌన్సిలర్లు బిల్ జయలక్ష్మి, షేక్ జమ్రుతి, ఇప్పాల వెంకటేశ్వరులు, గవురమ్మ, మాజీ కౌన్సిలర్లు బిల్ల రమేష్ యాదవ్,వెంకట్ రావు, అల్తాఫ్తో పాటు టిడిపి కార్యకర్తలు కూడా వైఎస్‌ఆర్‌ సీపీ కండువా కప్పుకున్నారు.

giddalur counselors


ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు నియోజకవర్గం పార్టీ  ఇన్ఛార్జ్ ఐ.వీ.రెడ్డి ఆధ్వర్యంలో లోటస్ పాండ్లో ఈ రోజు మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వీరితో పాటు పలువురు ఐటి ఉద్యోగులు  వైఎస్ జగన్‌ను కలిసారు. కాగా గిద్దలూరులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పలురకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఐవీ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ  రాబోయే రోజుల్లో టిడిపిలో ఒక్క కార్యకర్త కూడా మిగిలి ఉండే అవకాశం లేదని, అందరు మంచి భవిష్యత్ కోసం వైఎస్ఆర్ పార్టీ వైపే చూస్తున్నారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement