కిరణ్ అలా చెప్పుకోవడం సిగ్గుచేటు: కిషన్రెడ్డి | G Kishan Reddy takes on Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

కిరణ్ అలా చెప్పుకోవడం సిగ్గుచేటు: కిషన్రెడ్డి

Mar 10 2014 1:17 PM | Updated on Mar 29 2019 9:04 PM

కిరణ్ అలా చెప్పుకోవడం సిగ్గుచేటు: కిషన్రెడ్డి - Sakshi

కిరణ్ అలా చెప్పుకోవడం సిగ్గుచేటు: కిషన్రెడ్డి

మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి పార్టీ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి పార్టీ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు పార్టీ పెడతారా, లేదా అనేది తేలాల్సివుందన్నారు. సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా చేశానని కిరణ్ చెప్పుకోవడం సిగ్గుచేటని కిషన్రెడ్డి అన్నారు.

కిరణ్ యువ కిరణాలు దళారులకు వెళ్లాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో బీజేపీదే కీలకపాత్ర అని కిషన్‌రెడ్డి అన్నారు. మార్చి 11న హైదరాబాద్‌లో జరగనున్న సభకు తమ పార్టీ అగ్రనేతలు రాజ్‌నాథ్ సింగ్‌, అరుణ్‌ జైట్లీ హాజరవుతారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement