మే నుంచి ఆన్‌లైన్‌లో నిత్యావసర సరుకులు | from may onwards Essential goods through online | Sakshi
Sakshi News home page

మే నుంచి ఆన్‌లైన్‌లో నిత్యావసర సరుకులు

Apr 23 2015 3:53 AM | Updated on Sep 3 2017 12:41 AM

పౌర సరఫరాల విభాగంలో పీఎఫ్ షాపుల ద్వారా బీపీఎల్ కార్డుదారులకు నిత్యవసరుకులు అందజేసేందుకు...

- నూతన విధానంపై డిపోల్లో ప్రయోగాలు
- ఈ పాస్ విధానంలో పెరుగుతున్న లోపాలు
- మే నెల కూడా 242 డిపోల్లోనే ఈపాస్ అమలు
శ్రీకాకుళం పాతబస్టాండ్ :
పౌర సరఫరాల విభాగంలో పీఎఫ్ షాపుల ద్వారా బీపీఎల్ కార్డుదారులకు నిత్యవసరుకులు అందజేసేందుకు ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానం పూర్తిగా విఫలమయింది. ఏప్రిల్‌లో జిల్లాలో 242 డిపోల్లో ఈ పాస్ విధానం ప్రారంభించిన కనీసం 30 శాతం కూడా సఫలీకృతం కాలేదు. ఈ విధానంలో ఉన్న లోపాల వల్ల డీలర్లు, ప్రజలు అవస్థలు పడ్డారు.  చివరికి గతి లేక ఆధికారులు గతంలో వలే మ్యన్యువల్‌గా లబ్ధిదారులకు సరుకులు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ పాస్ ప్రయోగం వల్ల మంచి ఫలితాలు వస్తే,  మే నెల నుంచి మరిన్ని డిపోల్లో నూతన విధానం అమలు చేయాలని ఆధికారులు భావించారు. ఆశించిన రీతిలో ఈ పాస్ విధానం అమలు కాకపోవడంతో ఇబ్బందులు అధిగమించేందుకు మరో ప్రయత్నం అధికారులు ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్‌లో సుమారుగా 30 డిపోల్లో ఈ పాస్ యంత్రాలు మొరాయించాయి. నెట్ వర్కు సమస్యల వల్ల ఈ పాస్ యంత్రాలు పనిచేయ లేదు. ఎస్‌ఆర్‌డీ హెచ్  అనుసంధానం లేకపోవడం వంటి సమస్యలు వచ్చాయి.  

నెట్ వర్కు సమస్యను ఆధిగమించేందుకు మే నెల నుంచి ఏపీ ఆన్‌లైన్ విధానంలో ఈ సరుకులు ఈపాస్ విధానంలో అందజేసేందుకు ప్రయోగాలు ప్రారంభించారు. ఏప్రిల్‌లో  ఈ పాస్ విధానం అమలు చేసిన డిపోల్లోనే మే నెలలో కూడా అన్‌లైన్‌లో ఈ సరుకులు అందజేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. గతంతో ఈ నెట్ వర్కును నేషనల్ ఇన్పర్మేటివ్ సెంటర్ ద్వారా చేశారు. ఈ విధానం అమలులో సమస్యలు రావడంతో ఆన్‌లైన్ విధానంలో చేయాలని అధికారులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.  

ఈపాస్ విధానం అమలు చేస్తున్న డిపోలకు దగ్గరలో ఉన్న అన్‌లైన్ కేంద్రాల ద్వారా సరుకులకు సంబంధించిన అనుమతులు పొంది, ఆ రసీదు ఆధారంగా ఈ పాస్‌లో డిపోల వద్దకు వచ్చి సరుకులు తీసుకు వెళ్లాల్సింటుంది. ఇది లబ్ధిదారులకు కూడా భారంగా, కాలయాపనగా మారనుంది. పీఎస్ షాపుల డీలర్లకు కూడా ఇబ్బందులు  అధికమయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఆచరణలో సాధ్యంకాని, సంపూర్ణ స్థాయిలో నెట్ వర్కుని ఏర్పాటు చేయకుండా ఆదరాబాదరాగా రాష్ర్ట ప్రభుత్వం ఈ పాస్ విధానం తీసుకురావడంతో లబ్ధిదారులు, డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు.

ఏప్రిల్‌లో పాత విధానంలోనే పంపిణీ
జిల్లాలో 1990  డిపోలు ఉన్నాయి, ఈ డిపోల పరిధిలో బీపీఎల్ కార్డులు 7,66,611 ఉన్నాయి. ఏప్రిల్‌లో జిల్లాలో 242 డిపోల్లో ఈ పాస్ విధానం అమలు చేశారు. 242 డిపోల పరిధిలో 1,24,754 బీపీఎల్ కార్డులు ఉన్నాయి. వీటిలో కేవలం 36వేలు కార్డులకు మాత్రమే ఈ పాస్ ద్వారా సరుకులు అంద

జేశారు. మిగిలిన కార్డులకు గతంలో వలే మ్యాన్యువల్‌గా సరుకులు అందజేశారు. మే నెలలో 242 డిపోల్లో ఈ పాస్ విధానంలో సరుకులు ఏపీ ఆన్‌లైన్ సాయంతో అందజేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement