ఏపీ మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతికి గుండెపోటు 

Former Speaker Prathibha bharathi Suffers A Heart Attack - Sakshi

పరిస్థితి విషమం

ఆరిలోవ (విశాఖ తూర్పు): ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభా భారతి గుండెపోటుకు గురయ్యారు. ఆమె నగరంలోని ఆరిలోవ హెల్త్‌సిటీలోని పినాకిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతి భా భారతి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యు లు ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆమె తండ్రి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కొత్తపల్లి పున్నయ్య (92) వృద్ధాప్యంతో అనారోగ్యానికి గురయ్యారు.

ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయనను గురువారం అర్ధరాత్రి సమయంలో స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావ లి నుంచి విశాఖలోని పినాకిల్‌కు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అంబులెన్స్‌ వెంట కారులో కుమార్తె గ్రీష్మ ప్రసాద్, బంధువులతో కలిసి వస్తుండగా ప్రతిభా భారతి గుండెపోటుకు గురయ్యారు. కారు రణస్థలం దాటగానే ఆమెకు వాంతులు వచ్చాయని కుమార్తె గ్రీష్మ తెలిపారు. తన తాతయ్యతో పాటు తల్లిని కూ డా అదే ఆస్పత్రిలో చేర్పించామన్నారు. ప్రతిభా భార తి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పున్నయ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top