
సింగన్న దొర (ఫైల్ ఫొటో)
సాక్షి, పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మాజీ ఎమ్మెల్యే పునెం సింగన్న దొర(75) కన్నుమూశారు. ఆయనకు గురువారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపలే సింగన్న దొర మృతి చెందారు. 1994-99 మధ్య కాలంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. సింగన్న మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలిపారు.