ఒకరిని హత్య చేసిన కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలుశిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా జడ్జి సునీత బుధవారం తీర్పు చెప్పినట్లు లైజన్ అధికారి ఎన్.రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు.
హత్య కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
Aug 22 2013 3:45 AM | Updated on Apr 4 2019 5:20 PM
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ :ఒకరిని హత్య చేసిన కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలుశిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా జడ్జి సునీత బుధవారం తీర్పు చెప్పినట్లు లైజన్ అధికారి ఎన్.రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ మండలం రామాయి పంచాయతీ పరిధి అడ్డగుట్టకు చెందిన మడావి భీంరావు, టెకాం అయ్యూ, టెకాం లక్ష్మణ్‌తోపాటు జంగు, లక్ష్మీబాయి, నాగోరావు 2012 నవంబర్ 25న మాంగుర్ల గ్రామానికి పత్తి ఏరడానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాక కూలి డబ్బులు పంచుకున్నారు. అందులో రూ.30 మిగిలాయి. మడావి భీంరావు ఈ విషయమై టెకాం అయ్యూ, టెకాం లక్ష్మణ్‌ను నిలదీశాడు.
దీంతో క్షణికావేశానికి గురైన వారిద్దరు భీంరావును కట్టెలతో కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయూడు. అనంతరం నిందితులు పారిపోయారు. మృతుడి సోదరుడు మడావి లస్మ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రూరల్ సీఐ ఉదయ్‌కిరణ్ నేరస్తుల నేరారోపణ పత్రాన్ని కోర్టులో సమర్పించగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.ప్రవీణ్ 13 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువైనందున మొదటి అదనపు జిల్లా జడ్జి సునీత టెకాం అయ్యూ, టెకాం లక్ష్మణ్‌లకు 5 సంవత్సరాల జైలుశిక్షతోపాటురూ.వెయ్యి జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పినట్లు లైజన్ అధికారి రంగారావు వివరించారు.
Advertisement
Advertisement