అగ్నిప్రమాదంలో చిన్నారుల సజీవదహనం
గుంటూరుజిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు.
	గుంటూరు : గుంటూరుజిల్లా యడ్లపాడులో విషాదం చోటుచేసుకుంది. ఇల్లు దగ్ధమైన సంఘటనలో ఇద్దరు బాలికలు సజీవ దహనమయ్యారు.
	
	యడ్లపాడు గ్రామంలోని ఎర్రచెరువు ప్రాంతంలో ఖమ్మంపాటి రోశమ్మ, కల్పాల నాగమణి అనే మహిళలు వారి ఇద్దరి పిల్లలతో పూరిళ్లలో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మంటలు వ్యాపించడంతో రెండు ఇళ‍్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇళ‍్లలో  నిద్రిస్తున్న రోశమ్మ కుమార్తె బేబి(8), నాగమణి కుమార్తె కోకిల(3)లు సజీవదహనమయ్యారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
