మాఫీ కోరుతూ మహిళల పోరు | Fighting for women seeking waiver | Sakshi
Sakshi News home page

మాఫీ కోరుతూ మహిళల పోరు

Aug 9 2014 1:48 AM | Updated on Sep 29 2018 6:06 PM

మాఫీ కోరుతూ మహిళల పోరు - Sakshi

మాఫీ కోరుతూ మహిళల పోరు

డ్వాక్రా రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటిని చుట్టుముట్టారు.

డ్వాక్రా రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటిని చుట్టుముట్టారు. వారంతా రేలంగి గ్రామం నుంచి పాదయూత్రగా ఎమ్మెల్యే స్వగ్రామం వేల్పూరుకు చేరుకున్నారు.ఎలాంటి షరతులు లేకుండా పూర్తిస్థారుులో మాఫీని వర్తింప చేయూలని నినాదాలు చేశారు. ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దు చేస్తాం, ఒక్క పైసా చెల్లించవద్దని చెప్పిన చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారని మండిపడ్డారు.ఎండలో సుమారు గంటన్నరపాటు మహిళలంతా ఎమ్మెల్యే ఇంటిముందు బైఠారుుంచారు.     

- ఇరగవరం/తణుకు రూరల్
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement