దొరికిన డబ్బు ఇచ్చేశారు! | Farmers Caught Money Bag And Return In Chittoor | Sakshi
Sakshi News home page

దొరికిన డబ్బు ఇచ్చేశారు!

Jul 31 2018 12:00 PM | Updated on Jul 31 2018 12:00 PM

Farmers Caught Money Bag And Return In Chittoor - Sakshi

పులగింటి రామమూర్తి, సుందర్‌రాజు

చిత్తూరు, కురబలకోట: దొరికిన సొమ్మును పోగొట్టుకు న్న వ్యక్తికి అందజేసి నిజాయితీ చాటుకున్నా రు ఇద్దరు వ్యక్తులు. మండలంలోని అంగళ్లు గ్రామం తుమ్మచెట్లపల్లెకు చెందిన పులగింటి రామమూర్తి, పులగింటి సుందర్‌రాజ్‌ సోమవారం మధ్యాహ్నం సొంత పని మీద మోటార్‌ సైకిల్‌పై కురబలకోటకు బయలుదేరారు. వారు మార్గం మధ్యలోని జంగావారిపల్లె వద్దకు చేరుకోగానే రోడ్డుపై ఒక కవర్‌ కనిపించింది. అందులో ఆధార్, ఏటీఎం, పాన్‌కార్డులతో పాటు 75 వేల రూపాయల (కువైట్‌ కరెన్సీ, ఇక్కడి కరెన్సీ 25 వేల రూపాయలు కలిపి) నోట్లు కనిపించాయి. ఆధార్‌ కార్డు ఆధారంగా వారు ఆ కవరును  కువైట్‌ నుంచి కురబలకోటకు వచ్చిన బాషాదిగా గుర్తించారు. ఆ గ్రామానికి చెం దిన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి బైసాని చంద్రశేఖర్‌ రెడ్డి సమక్షంలో ఆ డబ్బును కువైట్‌ బాషాకు అందజేశారు. వారి నిజాయితీని తెలుసుకున్న ఎస్‌ఐ నెట్టి కంఠయ్య అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement