రైతు ప్రాణం తీసిన పెద్ద నోట్ల రద్దు | Farmer killed | Sakshi
Sakshi News home page

రైతు ప్రాణం తీసిన పెద్ద నోట్ల రద్దు

Nov 14 2016 2:00 AM | Updated on Oct 1 2018 4:01 PM

రైతు ప్రాణం తీసిన పెద్ద నోట్ల రద్దు - Sakshi

రైతు ప్రాణం తీసిన పెద్ద నోట్ల రద్దు

పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కర్నూలు జిల్లాలో ఓ రైతు ప్రాణం తీసింది. రూ.500, రూ.1,000 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

- బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం
- బైక్‌ను ఢీకొన్న కంటైనర్.. అక్కడికక్కడే మృతి చెందిన రైతు
- ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను కొట్టి చంపిన బంధువులు
- కర్నూలు జిల్లాలో ఘటన  
 
 కొలిమిగుండ్ల:  పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కర్నూలు జిల్లాలో ఓ రైతు ప్రాణం తీసింది. రూ.500, రూ.1,000 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రైతు నడుపుతున్న బైక్‌ను సిమెంట్ కంటైనర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆగ్రహావేశాలకు లోనైన రైతు బంధువులు సిమెంట్ కంటైనర్ డ్రైవర్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతనూ మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం హనుమంతుగుండంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నారుు..

 బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకని బయల్దేరి..
 గ్రామానికి చెందిన ఎరగ్రొల్ల చిన్నరాజు(40).. నెల రోజులక్రితం రెండున్నర ఎకరాల భూమిని రూ.12,50,000కు కొనుగోలు చేశాడు. భూమి విక్రరుుంచిన రైతుకు మొత్తం సొమ్ము ఇచ్చేందుకు యత్నించగా పాత రూ.500, రూ.1,000 నోట్లను తీసుకునేందుకు అతను నిరాకరించాడు. దీంతో సంజామల మండలం పేరుసోముల ఆంధ్రాబ్యాంక్‌లో రెండు రోజులనుంచి రోజూ చిన్నరాజు రూ.1.50 లక్షల చొప్పున భార్యాభర్తల అకౌంట్‌తోపాటు అదే గ్రామానికి చెందిన పుల్లయ్య అకౌంట్‌లో జమ చేశాడు. మూడో రోజు డబ్బును జమ చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో పుల్లయ్యను వెంట తీసుకొని బైక్‌పై బయలుదేరాడు. గ్రామ సమీపంలోని బస్‌షెల్టర్ వద్దనున్న ప్రధాన రహదారిపైకి రాగానే.. అదే సమయంలో వైఎస్సార్ కడప జిల్లా ధర్మల్ నుంచి కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట సమీపంలోనున్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి ప్లాస్ తరలిస్తున్న కంటైనర్.. బైక్‌ను ఢీకొంది. వెనకున్న పుల్లయ్య ఎగిరి పక్కకు పడటంతో అతనికి ప్రాణప్రాయం తప్పింది. అరుుతే బైక్‌ను నడుపుతున్న చిన్న రాజును కంటైనర్ కొద్ది దూరం ఈడ్చుకొని వెళ్లడంతో తల, చేరుు పూర్తిగా ఛిద్రమై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.

 డ్రైవర్‌పై దాడి..దెబ్బలతో మృతి
 ప్రమాదం అనంతరం కంటైనర్ డ్రైవర్ బెస్త మధు(40) తప్పించుకొని పోయేందుకు ప్రయత్నించాడు. అరుుతే స్థానికులు అడ్డుకు న్నారు. ఈలోగా అక్కడకు చేరుకున్న మృతు ని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహావేశంతో అతనిపై దాడికి దిగి తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. మధు స్వస్థలం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం అనంతగిరి. ప్రమాద స్థలిలో రెండు కుటుంబాల సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటారుు. ప్రమాద విషయం తెలియడంతో ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, ఎస్‌ఐ బీటీ వెంకటసుబ్బయ్య ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, కంటైనర్ డ్రైవర్ మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బీటీ వెంకటసుబయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement