తన పేరు రుణమాఫీ జాబితాలో లేదని ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులో గురువారం చోటు చేసుకుంది.
గుంటూరు: రైతుల మృత్యుఘోష ఆగడం లేదు. తన పేరు రుణమాఫీ జాబితాలో లేదని ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులో గురువారం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం పాతగణేశునిపాడుకు చెందిన మురారి అనే రైతు ఆత్మహత్యక పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
తన పేరు రుణమాఫీ జాబితాలో లేదని మనస్తాపం చెందిన ఆ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.