ఒంటరిగా ఉండలేక ఫినాయిల్ తాగిన విద్యార్థిని | famele Student drinks Phinayil without Lonely | Sakshi
Sakshi News home page

ఒంటరిగా ఉండలేక ఫినాయిల్ తాగిన విద్యార్థిని

Jul 1 2016 2:52 AM | Updated on Nov 9 2018 5:02 PM

ఒంటరిగా ఉండలేక ఫినాయిల్ తాగిన విద్యార్థిని - Sakshi

ఒంటరిగా ఉండలేక ఫినాయిల్ తాగిన విద్యార్థిని

తల్లిదండ్రులను వదిలి హాస్టల్‌లో ఒంటరిగా ఉండలేక ఒక విద్యార్థిని ఫినాయిల్ తాగింది...

తిరుపతి మెడికల్  : తల్లిదండ్రులను వదిలి హాస్టల్‌లో ఒంటరిగా ఉండలేక ఒక విద్యార్థిని ఫినాయిల్ తాగింది. ఈ సంఘటన తిరుపతిలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు, వైద్యుల కథనం మేరకు.. తిరుపతి గిరిపురానికి చెందిన  కృష్ణయ్య కుమార్తె హేమావతి స్థానిక నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం యథావిధిగా పాఠశాలకు వెళ్లింది. ఇంటర్వెల్ సమయంలో పాఠశాలలో ఉన్న ఫినాయిల్ బాటిల్ తీసుకుని తాగింది. కొంత సేపటికి కడుపు నొప్పి రావడంతో తల్లడిల్లింది.

తోటి విద్యార్థులు ఆమెను రుయాకు తీసుకెళ్లారు. వైద్యులు విచారించగా అసలు విషయం చెప్పింది. హాస్టల్‌లో ఒంటరిగా ఉండలేక ఫినాయిల్ తాగానని పేర్కొంది. ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడూ సందడిగా ఉండే నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు అందేలా ఫినాయిల్ ఎందుకు పెట్టారు. ఒక విద్యార్థిని ఫినాయిల్ తాగుతుంటే తోటి విద్యార్థులు ఎందుకు అడ్డుకోలేకపోయారు.

టీచర్లు ఏం చేస్తున్నారు. ఆ విద్యార్థిని చిన్న పిల్లలతో రుయా ఆస్పత్రికి పంపాల్సిన అవసరం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో టీచర్లు మందలించారా, లేక వసతి గృహంలో ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement