దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు | Fake currency gang arrested by Kurnool city police | Sakshi
Sakshi News home page

దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు

Oct 29 2014 9:32 AM | Updated on Jul 26 2018 1:42 PM

దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు - Sakshi

దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు

కర్నూలు జిల్లాలో దొంగనోట్ల కలకలం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు.

కర్నూలు: కర్నూలు జిల్లాలో దొంగనోట్ల కలకలం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. దాంతో దొంగనోట్ల చలామణి చేస్తున్న ఓ ముఠా గుట్టును కర్నూలు నగర పోలీసులు బుధవారం తెల్లవారుజామున రట్టు చేశారు. నగర పోలీసులు తనిఖీలలో భాగంగా బుధవారం తెల్లవారుజామునా ఓ నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ను తరలించారు. ఆ ముఠాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో భాగంగా పోలీసులు ముఠా సభ్యులను ప్రశ్నించగా వారు ఎంతకీ పెదవి విప్పలేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో స్పందించారు. దాంతో ముఠా సభ్యుల నోటి నుంచి నిజాలు తన్నుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు ముఠాసభ్యులు పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణ కొనసాగుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement